Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తండ్రి పాత్ర చేయడానికి సిద్ధమైపోయిన శ్రీకాంత్

  • కన్నడలో హిట్ కొట్టిన 'కాలేజ్ కుమార'
  • తెలుగు రీమేక్ కి సన్నాహాలు
  •  కథానాయకుడిగా రాహుల్ విజయ్    
ఫ్యామిలీ హీరోగా శ్రీకాంత్ ఒక వెలుగు వెలిగాడు. ఆ తరువాత హీరోగా వచ్చిన అవకాశాలను అందుకుంటూనే, కీలకమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. గతంలో మెగా హీరోల సినిమాల్లో బాబాయ్ పాత్రల్లో కనిపించిన ఆయన, ఈ సారి తండ్రి పాత్రలో కనిపించడానికి సిద్ధమైపోయాడు. 2017లో 'సంతు' దర్శకత్వంలో కన్నడలో వచ్చిన 'కాలేజ్ కుమార' అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

ఆ దర్శకుడే ఇప్పుడు ఈ సినిమాను తెలుగు .. తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి రంగంలోకి దిగాడు. కన్నడలో విక్కీ వరుణ్ హీరోగా చేయగా .. తండ్రి పాత్రను రవిశంకర్ పోషించాడు. తెలుగులో హీరోగా రాహుల్ విజయ్ ను ఎంపిక చేసుకున్నారు. ఆయన తండ్రి పాత్రలో శ్రీకాంత్ కనిపించనున్నాడు. ఇక తమిళంలో హీరో ఎవరనే విషయంలో స్పష్టత రాలేదుగానీ, తండ్రి పాత్ర కోసం 'ప్రభు'ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్ 3వ వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.
srikanth
rahul vijay

More Telugu News